Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానాన్ని కూల్చేస్తానంటూ బెదిరించిన‌ ప్ర‌యాణికుడు.. అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేసిన పైల‌ట్‌

airplane emergency land in oklahoma
  • ప్ర‌యాణికుల‌తో గొడ‌వ‌
  • విమాన సిబ్బందిని కొట్టిన వైనం
  • లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న విమానంలో ఘ‌ట‌న‌
ఓ విమానంలో ప్ర‌యాణికుడు క‌ల‌క‌లం రేపాడు. తోటి ప్ర‌యాణికుల‌తో గొడవ పెట్టుకుని రెచ్చిపోయాడు. దీంతో విమాన‌ సిబ్బందికి తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ వ్య‌క్తి విమాన సిబ్బంది మాట‌ను కూడా విన‌కుండా మ‌రింత చెల‌రేగిపోయాడు.  

విమానాన్ని కూల్చేస్తాన‌ని ప్ర‌యాణికుల‌ను బెదిరించాడు. విమాన సిబ్బంది ఎంత స‌ముదాయించినా విన‌కుండా త‌న గొడ‌వ‌ను కొన‌సాగించాడు. ఇద్ద‌రు విమాన సిబ్బందిని కొట్టాడు. దీంతో అత‌డిని ప‌ట్టుకుని అత‌డి సీటుకే క‌ట్టేసిన విమాన సిబ్బంది పైలట్‌కు ఈ స‌మాచారం అందించారు.

దీంతో ఆ విమానాన్ని పైల‌ట్ అత్య‌వ‌స‌రంగా దించాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్ విమానం 1730లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌యాణికుడు హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో విమానాన్ని చివ‌ర‌కు ఓక్లహోమా సిటీలో దించారు. ఆ ప్ర‌యాణికుడిని ఎయిర్‌పోర్ట్ పోలీసుల‌కు విమాన సిబ్బంది అప్ప‌గించారు. ఆ నిందితుడు డెల్టా ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగి అని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ కొన‌సాగిస్తున్నారు.


USA
airport

More Telugu News